![]() |
![]() |
.webp)
బుల్లి తెర మీద అనసూయ గురించి తెలియని వారు లేరు. అలాంటి అనసూయ ఇప్పుడు కొట్టం ఇంట్లోకి వెళ్ళింది. ఈ గృహప్రవేశ వేడుకను ఫొటోస్, వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. " ఆ సీతారామాంజనేయ కృపతో...మా తల్లితండ్రుల ఆశీర్వాదంతో..మీ అందరి ప్రేమతో...మా జీవితంలో మరో అధ్యాయం..మా కొత్త ఇంటి పేరు తెలుసా..శ్రీరామ సంజీవని" అని చెప్పింది. అలాగే జై హనుమాన్, జై శ్రీరామ్ అంటూ హాష్ ట్యాగ్స్ పెట్టింది. అనసూయ, సుశాంక్ భరద్వాజ్ వాళ్ళ పిల్లలు కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన అనసూయ ఫామిలీకి అందరూ విషెస్ చెప్తున్నారు. "మాకు కూడా వాటా ఉంటుందా" అంటూ సమీరా భరద్వాజ్ కామెంట్ చేసింది. "కంగ్రాట్యులేషన్స్ అను, నిక్కు, షోరూ, ఆయాన్ష్" అంటూ శ్రీముఖి మెసేజ్ పెట్టింది.

పాగల్ పవిత్ర, యాంకర్ గాయత్రి భార్గవ్, జబర్దస్త్ కమెడియన్ గడ్డం నవీన్, ఆర్జె చైతు, భానుశ్రీ, నటి, లేడీ కమెడియన్ రోహిణి, సింగర్ పర్ణిక, ఐశ్వర్య మీనన్, సింగర్ అనుదీప్ వంటి వాళ్లంతా కూడా వాళ్లకు శుభాకాంక్షలు చెప్పారు. అనసూయ ఇప్పుడు కిర్రాక్ బాయ్స్, ఖిలాడీ గర్ల్స్ షోకి శేఖర్ మాష్టర్ తో జడ్జ్ గా చేస్తోంది. అలాగే షాప్ ఓపెనింగ్స్ కి కూడా వెళ్తూ ఆ పిక్స్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. రంగస్థలం మూవీతో అనసూయకు ఎంతో మంచి పేరు పేరు వచ్చింది. తర్వాత పుష్ప మూవీలో రోల్ కి అలాగే విమానం మూవీలో చేసిన రోల్ కి అనసూయకు మంచి మార్కులు పడ్డాయి. అనసూయ ఎంత బిజీగా ఉన్నా తన ఫామిలీతో తన పెట్స్ తో మంచి టైం స్పెండ్ చేస్తుంది. షోస్ అన్నీ చూసుకుని ఇంటికి వెళ్లి కుటుంబంతో టూర్లకు వెళ్తూ ఉంటుంది. అనుసయా కొత్త ఇల్లు మాత్రం మంచి కాస్ట్లీ అండ్ గ్రాండ్ లుక్ తో అందరినీ ఆకర్షించేదిగా ఉంది.
![]() |
![]() |